శివుని బాల్యం గురించి మనం విన్నామా.? ఎక్కడైనా పురాణాలలో చదివామా.?

శివుని బాల్యం గురించి మనం విన్నామా.?  ఎక్కడైనా పురాణాలలో చదివామా.?  శివుని బాల్యం గురించి మనం దాదాపుగా ఎక్కడా, ఏ విధమైన పురాణాలలో వినలేదు చదవలేదనే చెప్పవచ్చు.కానీ ఒకే ఒక చోట శివుడు బాలుడుగా మారుతాడు. ఆ కథ మనందరికీ తెలిసిందే. అదే అత్రి అనసూయ దేవికి త్రిమూర్తుల ఆంశతో జన్మించిన దత్తావతార కథ. ఆ కథ ఏమిటో క్లుప్తంగా మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. ఒకనాడు ఉమా,వాణి, లక్ష్మీ ముగ్గురు నేను గొప్పంటే నేను గొప్ప అని వాదులాడుకుంటుండగా అక్కడికి నారదుడు వచ్చి, “తల్లులారా మీ కన్నా గొప్పది ఆ అనసూయమ్మ తల్లి” అని చెప్పాడు.

అప్పుడు ఆ అమ్మత్రయం అనసూయను పరీక్షించదలచి, తన భర్తలనే అనసూయ వద్దకు పరీక్షించడానికి పంపిస్తారు. వారు ముగ్గురు సాధారణ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అనసూయమ్మను భోజనం పెట్టమంటారు. అదీ వివస్త్రగా. అప్పుడు మహ ప్రతివ్రతైన అనసూయ ఏ మాత్రం చలించక, తన భర్తైన అత్రి మహర్షని మనస్సులో తలుచుకుని ఆ త్రిమూర్తుల మీదకు కమండలంలోని జాలాన్ని వారి మీద జిలకరించింది. అంతే త్రిమూర్తులు ముగ్గురు పసి బాలలైపోయారు.

అనసూయ వారికి వివస్త్రయ్తె భోజన ఉపచారాలు చేసి ముగ్గురూని మూడు ఊయ్యలలో వేసింది అది చసి ఉమా, వాణి,లక్ష్మీ ముగ్గురూ తమ తప్ప తెలుసుకుని గబగబా అనసూయ దగ్గరకు వచ్చి కొంగు చాచి పతిబిక్ష పెట్టమని ప్రాధేయపడ్డారు. అనసుయ మరలా పసిపాపలైన ఆ ముగ్గురి మీద జలం చిలకరించింది పసిపాలు ముగ్గరు త్రిమూర్తులుగా దర్శన మిచ్చారు అత్రి, అనసూయ త్రిమూర్తూలకు త్రిమాతలకు ప్రనమిల్లారు. ఇక మిగతాకథ మనకు అప్రస్తుతం. అన్ని పురాణాలలో శివ బాల్యం గురించి మనకు వివరణ లభించ కధ ఇది ఒక్కటే.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*