హంపిలో ఉన్న బడవ శివలింగం గురించి ఎంత మందికి తెలుసు.???

హంపిలో ఉన్న బడవ శివలింగం గురించి ఎంతమందికి తెలుసు.???  బడవ శివలింగం ఇది.  ఇది ఇంతకు ముందు చెప్పుకున్న యోగ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం పక్కనే కలదు ఈ అతి పెద్ద ఏక శిలా శివలింగం. మరి దీన్ని ఏకశిలా శివలింగం అనే అనవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు బడవ శివలింగం అని ఎందుకు అంటున్నారు అనే సందేహం రావచ్చు. బడవ అంటే బీద ( పేద ). ఈ దేవాలయాన్ని నిర్మించింది ఒక బీద స్ర్తీ అని మనకు శాసనాల పరంగా ఈ చరిత్ర మనకు తెలుస్తుంది.

విరూపాక్ష దేవాలయానికి వెళ్ళే దారిలోనే ముందే ఎడమ వైపు పొలాల్లోకి వెళితే ఈ బడవ శివలింగం ఒక చిన్న గదిలో నిర్మితమై ఉంటుంది. పది అడుగుల ఎత్తు గల ఈ ఏక శిల విగ్రహం ఇట్టే మనసును ఆకట్టుకుంటుంది. ఈ శివ లింగం పై మూడు కన్నులు గల గీతలు చెక్కబడి ఉంటాయి. ఇక్కడికి వెళ్ళిన యాత్రికులు రూపాయి నాణాలను ఆ మూడో కన్నుకి తగిలేట్టు వేస్తారు. అక్కడ తాకితే వారు మనసులో కోరుకున్న కోరిక నెరవేరుతుందని నమ్మకం. ఇంకా ఈ బడవ శివలింగం చుట్టూ రాతి బండలతో నిర్మితమైన గోడ కలదు.

పై భాగం కాలక్రమేనా కూలి పోయి రంద్రం ఏర్పడింది ఆ రంద్రం నుండి వెలుతురు సరాసరి శివలింగం పై పడుతుంది ఇది కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇంక ఈ శివలింగం యొక్క విశేషం ఏంటంటే. ఇక్కడ శివలింగం అన్నీ కాలాల్లో నీటితో మూడు అడుగుల మేర నిండి ఉంటుంది. ఆ నీటిలోకి ఇతరులు ప్రవేశించరాదు. ఈ నీరు లోనికి రాతితో నిర్మించిన కాలువల ద్వారా లోనికి వచ్చి, మళ్ళీ అదే మార్గం గుండా బయటకు వెళ్ళిపోతుంది. ఈ రాతి కాలువలు శ్రీ కృష్ణ దేవరాయలు నిర్మించిన కాలం నాటివే.

ఇక్కడ ఈ నీటి కాలువల ద్వారా నే పంటలు పండిస్తారు. కృష్ణ దేవరాయలు కాలం నుండే పంటలు పండిస్తున్నారు. ఇన్ని విశేషాలు చూస్తుంటే మనకు భళా రే భళా శ్రీ కృష్ణ దేవరాయ నీవు హిందూ ధర్మం కోసం చేసిన కృషి అమోఘం అని పొగడాలనిపిస్తుంది. మరి ఆయన నిర్మించిన కట్టడాలు మామూలువి కావు ప్రపంచంలో మరెవ్వరికీ సాధ్యం కాదు ఒక్క శ్రీ కృష్ణ దేవరాయలుకి తప్ప.

మీరు హంపి వెళ్తే అబ్బ నేను ఈ కాలంలో ఎందుకు పుట్టలేదా ఇంతటి సుందరమైన లోకాన్ని ఆ కాలాన్ని కోల్పొయ్యామనిపిస్తుంది మనకు. కానీ ముష్కరులకు ఇంతటి సంపదను ఎలా కొల్లపొడవడానికి చేతులు వచ్చాయో అర్ధం అవ్వదు. రాజ్యాన్నంతటినీ నేలమట్టం చేసారు ఇంకా ఎన్నో అధ్భుతమైన దేవాలయాలు కాలగర్భంలో కలిసిపోయాయి.

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*