శ్రీ పాండు రంగ స్వామి దేవాలయం – చిలకలపూడి

శ్రీ పాండు రంగ స్వామి దేవాలయం – చిలకలపూడి  కృష్ణా జిల్లా లోని మచిలీపట్టణమందు ఈ పాండురంగని దేవాలయం కలదు. భక్తులకు కొంగు బంగారమై పిలుస్తే పలికే దైవంగా పేరు పొందిన చిలకలపూడి పాండురంగస్వామిని, సేవించి, తరించిన భక్తులెందరో ఉన్నారు. వారిలో నేను ఒకరినే. పాండు రంగ స్వామి ఇక్కడ స్వయముగా వెలసిన స్వయంభువు. ఇక్కడ ప్రజల కష్టాలను తీర్చుటకు వెలసిన ఈ స్వామి చెంతకు ప్రతి ఒక్క భక్తుడు నేరుగా వెళ్ళి పాదాలను తాకి పూజించేందుకు అవకాశం ఉండటం ఒక విశేషం.

మహరాష్ట్రలో ఉన్న పుండరీపురం తర్వాత అంటతి ప్రాధాన్యత సంతరించుకన్నది ఈ చిలకలపుడి పాండురంగస్వామి దేవాలయం. శ్రీ పుండరీపురంలో నరసింహుడు అనే భక్తుడు నిత్యం పాండురంగని సేవిస్తూ ఉండేవాడు. ఈ నరసింహుడు మహీపతి మహరాజు వద్ద తారకమంత్రం, విఠల్ మంత్రాలను జపిస్తూ ఉండేవాడు. అతడు 1905 లో చిలకలపూడి వచ్చి ఇచట నివాసము ఏర్పరచుకుని జ్ఞానేశ్వర తుకారాం అని ఒక మఠాన్ని స్థాపించి పాండురంగని భజనలు, అన్నసమారాధనలు చేస్తుండేవారు.

ఒక రోజు పాండురంగస్వామి భక్త నరసింహుడి కలలో కనబడి ఈ ప్రాంతంలో ఆలయం నిర్మిస్తే స్వయంభువుగా అవతరిస్తానని చెప్పాడు. స్వామి ఆదేశాల మేరకు అతి తక్కువ సమయంలోనే అతి పెద్దగా ఐదు ఎకరకాలలో భక్త నరసింహుడు దేవాలయాన్ని నిర్మించాడు.

పాండురంగ స్వామివారు స్వయంభువుగా వెలుస్తారన్న వార్త జిల్లా అంతటా వ్యాప్తి చెందింది. వేలాది మంది ప్రజలు ఆలయం చుట్టూ గుమిగూడారు. విషయం తెలుసుకున్న బ్రిటీష్ వారు గర్భాలయంకు సీలు వేసారు. పాండురంగ స్వామి వారు ఆవిర్భవించకుంటే స్వామివారిలో లీనమైపోతానని ప్రతిజ్ఞ చేసి భక్త నరసింహుడు విఠలనామం జపించసాగాడు. వేలాదిమంది ఆనందోత్సాహల మధ్య ఆలయంలో పెద్ద శబ్దం వినబడింది.వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. కార్తీక శుద్ద ఏకాదశి పర్వదినాన పాండురంగడు భక్తుల సమక్షంలో ఈ ఆలయంలో వెలిశాడు.

ఆనాటి నుండి ప్రతీ ఏటా కార్తీక శుద్ద ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఉత్సవాలు జరుగుతూనే ఉన్నారు. జ్ఞానేశ్వర్, భక్త తుకారం, మీరాబాయి, జానాబాయి, సక్కుబాయి వంటి భక్తులు చిన్న చిన్న మందిరాల్లో భక్తులకు దర్శణమిస్తారు. ఆ తరువాత సాయిబాబా మందిరం, రామ మందిరం కూడా వెలిశాయి. ఆలయ ప్రాంగంణం అంతా చాలా విశాలంగా ఉంటుంది.

ఈ ఆలయ ప్రాంగణంలో రావు చెట్టు కలదు, దాని క్రింద సిద్దేశ్వర స్వామి వారి ఆలయం కలదు. భక్తులు తాము కోరుకున్న కోరికలు ఇక్కడ సిద్దించగలవని అందువల్ల ఇక్కడ ఉన్న పరమేశ్వరున్ని సిద్దేశ్వరునిగా కొలుస్తారు. శ్రీ పాండురంగస్వామి వారికి పటికబెల్లం అంటే ప్రీతి. భజలు అంటే మరీ ఇష్టం. ఇతర రాష్ఱ్రాలనుండి కూడా ఇక్కడకు భక్తులు వచ్చి భక్తి బావంతో భజనలు చేస్తూ స్వామి వారిని అర్చించి స్వామి వారి అపార కృపకు పాత్రులవుతారు. విజయవాడ నుండి మచిలీపట్నంకు

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*